Rajinikanth 2.0 Released: Fans Speak To India Today

3
2

Today is a big day for #Rajinikanth fans as 2.0 hits the screens. The Robot Enthiran sequel is the most expensive film made in India with a budget of Rs 543 crore and features Rajinikanth, #AkshayKumar, Riyaz Khan, Sudhanshu Pandey and Kalabhavan Shajohn. In Chennai, celebrations are on as fans got together and offered prayers at the Sion temple. In Tamil Nadu, the film is being screened in 625 theatres. Our reporters report live from Chennai, Hyderabad, Mumbai and Bengaluru as 2.0 fever grips the country.
#2point0

Subscribe to India Today for NEW VIDEOS EVERY DAY and make sure to enable Push Notifications so you’ll never miss a new video.

All you need to do is PRESS THE BELL ICON next to the Subscribe button! India Today TV is India’s leading English News Channel. India Today YouTube channel offers latest news videos on Politics, Business, Cricket, Bollywood, Lifestyle, Auto, Technology, Travel, Entertainment and a lot more.

Stay tuned for latest updates and in-depth analysis of news from India and around the world!

Download Mobile App from India’s No.1 New Video Publisher : https://indiatoday.app.link/zKoSVVDrnP

Follow us: Official website: http://indiatoday.intoday.in/

Twitter: https://twitter.com/IndiaToday

Facebook: https://www.facebook.com/IndiaToday

source

3 COMMENTS

  1. రివ్యూ: 2.ఓ

    చిత్రం: 2.ఓ

    నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాంజాన్‌, రియాజ్‌ఖాన్‌ తదితరులు

    సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌

    సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా

    ఎడిటింగ్‌: ఆంథోని

    ఆర్ట్‌: టి.ముత్తురాజు

    వీఎఫ్‌ఎక్స్‌ అడ్వైజర్‌: శ్రీనివాసమోహన్‌

    ఫైట్స్‌: సెల్వ

    నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం

    రచన, దర్శకత్వం: శంకర్‌

    సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌

    విడుదల తేదీ: 29-11-2018

    క‌థేంటంటే: ఉన్నట్టుండి చెన్నైలో అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూ మ‌రీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. ఇంత‌లో సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి ఆకార‌పు రూపం న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని భావిస్తారు. వశీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌) ఆ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం అవుతాడు. అలా చిట్టి మ‌ళ్లీ రంగ ప్ర‌వేశం చేసి – అత్యంత బ‌ల‌మైన ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌)ని ఎలా ఎదుర్కొంది? అస‌లు ఆ ప‌క్షిరాజు క‌థేమిటి? అనేది తెలియాలంటే 2.ఓ చూడాల్సిందే.

    ఎలా ఉందంటే: శంక‌ర్ ఎప్పుడూ సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విష‌యాన్నే ఎంచుకోవ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. 2.ఓ విష‌యంలో ఆయ‌న సెల్‌ఫోన్‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో… ఈ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టారు. వాటి చుట్టూ ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ప్ర‌ధ‌మార్ధంలో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్ర‌వేశం చేస్తాడో.. అప్పుడు ఓ ర‌స‌వత్త‌ర‌మైన పోరు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ప‌క్షిరాజుగా అక్ష‌య్ ని చూపించ‌డంతో విశ్రాంతి కార్డు ప‌డుతుంది.

    ద్వితీయార్ధం మొత్తం చిట్టి – ప‌క్షిరాజుల ఆధిప‌త్య పోరే చూపించారు. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృద‌యాన్ని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ సినిమాలో ఎమోష‌న్ పండింది అంటే… ఈ ఒక్క ఎపిసోడ్ లోనే. ప‌తాక స‌న్నివేశాల్ని విజువ‌ల్‌గా ఓ స్థాయిలోకి తీసుకెళ్లాడు శంక‌ర్‌. కొన్ని స‌న్నివేశాలు రోబోలో చూసిన‌ట్టే అనిపిస్తుంటాయి. ప్ర‌చార చిత్రాలు చూసిన‌వాళ్ల‌కు ఈ సినిమా క‌థ‌పై ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డి ఉంటుంది. వాటికి లోబ‌డే సినిమా ఉంటుంది.

    క‌థ ప‌రంగా.. ద‌ర్శ‌కుడు అద్భుతాలేం చూపించ‌లేదు. త‌న దృష్టంతా ఈ సినిమాని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డంపైనే సాగింది. కొన్ని స‌న్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తాయి. అయితే… శంక‌ర్ ఈ కథను ఎమోష‌న‌ల్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. భావోద్వేగాల‌న్ని బ‌లంగా రాబ‌ట్టుకొనే శంక‌ర్‌… ఆ విష‌యంలో కాస్త లోటు చేశాడేమో అనిపిస్తుంది. కానీ, విజువల్‌గా శంకర్‌ వండర్‌ సృష్టించాడు. చివరి 30 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 3డీలో చూస్తే ‘2.ఓ’కు శంకర్‌ పడిన కష్టం స్పష్టం తెలుస్తుంది. ఇక ఇందులో 3.ఓ మినీ రోబోగా రజనీ నటన చిన్నారులను అలరిస్తుంది. అయితే, రోబోలో ఐశ్వ‌ర్య రాయ్ లాంటి స్టార్ నాయిక ఉండ‌డంతో ఆ పాత్ర‌కు వెయిటేజ్ ఇవ్వ‌గ‌లిగాడు. ఈసారి… ఐష్ లోని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది.

    @t
    బ‌లాలు

    + చిట్టి – ప‌క్షిరాజు పోరాటాలు

    + విజువ‌ల్ ఎఫెక్ట్స్‌

    + ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌

    + భారీద‌నం

  2. HATS OFF TO HON. ASHAY KUMAR.
    I THINK IN MOVIES ITS HON. SHANKAR'S, TAMILIAN BRAIN POWER, AND RAJINI IS A PUPPET. THE MOVIE WAS PRODUCED BY SL TAMILIAN BUSINESSMAN INVESTING $650+/- CRORE.

Comments are closed.